పెద్దనోట్ల రద్దు వల్లే రుణభారం: వీడియోకాన్‌

పెద్దనోట్ల రద్దు వల్లే రుణభారం: వీడియోకాన్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు, బ్రెజిల్‌ ప్రభుత్వాల నిర్ణయాల వల్ల తమకు రూ.3900 కోట్ల రుణభారం పడిందని వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. వీడియోకాన్‌పై ఎస్‌బీఐ నేతృత్వంలోని చాలా బ్యాంకులు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను కోర్ట్ స్వీకరించింది. దీంతో వీడియోకాన్‌ కంపెనీ యాజమాన్య నియంత్రణను అదుపులోకి తీసుకొమ్మని అన్ని బ్యాంకులకు ఆదేశించింది. ఈ క్రమంలో యాజమాన్య నియంత్రణను కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయించనుంది వీడియోకాన్‌. అయితే రుణభారం పడటానికి గల కారణాలను కంపెనీ.. ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. '2016 నవంబరులో ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం వలన కాథోడ్‌ రే ట్యూబ్‌ టెలివిజన్ల తయారీ.. టెలికాం లైసెన్సులను సుప్రీంకోర్టు రద్దు చేయడం.. బ్రెజిల్‌లో చమురు సంస్థ ఏర్పాటుకు ఆ దేశ ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వకపోవడం' వలనే మాపై ఇంత మొత్తంలో భారం పడిందని పేర్కొంది.