హ్యాపీ బర్త్ డే వెంకటేష్

హ్యాపీ బర్త్ డే వెంకటేష్

టాలీవుడ్ లో ఇప్పుడున్న సీనియర్ హీరోలలో వెంకటేశ్ దగ్గుబాటికి ప్రత్యేక స్థానం ఉంది. తన స్టార్ డమ్ ఇమేజ్ లను పక్కన పెట్టి మంచి కథాబలం ఉండే సినిమాలకు ప్రాధాన్యతనిస్తాడు. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ బాబు బంగారం. తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు బీజం వేసింది వెంకీనే. వెంకటేశ్ సినిమా అంటే కచ్చితంగా అది మినిమం గ్యారెంటీ సినిమా అనే చెప్పాలి. అందుకే ఆయనకు 'విక్టరీ' వెంకటేశ్ అనే పేరు. మూవీ మొఘల్ దివంగత రామానాయుడు కుమారుడిగా 1986లో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్, తన కెరియర్ లో ఇప్పటివరకు 72 సినిమాలు చేశాడు. ఆయన నటించిన 73 వ సినిమా వెంకీ మామ ఈరోజు రిలీజ్ కానుంది. 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న వెంకటేశ్ పుట్టినరోజు నేడు.