ఇది చిన్నదాడే... మున్ముందు చాలా ఉంది!

ఇది చిన్నదాడే... మున్ముందు చాలా ఉంది!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై ఈ రోజు జరిగిన దాడి చిన్నదే... ఇంకా మున్ముందు చాలా ఉందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని వెళ్తున్న సమయంలో అలిపిరి దగ్గర బీజేపీ చీఫ్ అమిత్‌షా కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణులు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఓ జాతీయ పార్టీ చీఫ్‌పై దాడికి యత్నించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్‌‌ టాపిక్‌గా మారిపోయింది. ఈ ఘటనపై స్పందించిన వీహెచ్... ప్రజలను మోసం చేసినవారు ఆ శ్రీవారి ఆగ్రహం చవిచూడక తప్పదని వ్యాఖ్యానించారు. 

ఏపీ ప్రజలను మోసం చేసినందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై దాడికి యత్నించారన్నారు వీహెచ్... అసలు ఆయనపై జరిగింది చిన్నదాడే... ఇంకా మున్ముందు చాలా ఉందన్న కాంగ్రెస్ సీనియర్ నేత. ఏపీలో అమిత్ షా ఎక్కడ కనిపించినా ప్రజలు తరిమి తరిమి కొడతారంటూ హెచ్చరించారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాలను మోసం చేసింది కాబట్టే ప్రజలంతా బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు వీహెచ్. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించిన వీహెచ్... కర్నాటకలో బీజేపీ ఓడిపోవడం ఖాయం... కాంగ్రెస్ విజయం సాధించడం పక్కాఅన్నారు.