వెంకీ, చైతులకు ముహూర్తం ఫిక్స్ 

వెంకీ, చైతులకు ముహూర్తం ఫిక్స్ 

వెంకటేష్, నాగ చైతన్య  కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ వరుసకు మామ, అల్లుళ్ళు కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ ఏర్పడింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ప్రాజెక్టుకు వెంకీ మామ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ఈనెల 23న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూలై మొదటి వారం నుండి ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి, చైతుకు జోడిగా రకుల్ ప్రీత్ లు నటించనున్నారు. ఈ చిత్రాన్నికి బాబీ దర్శకత్వం వహించనున్నారు. సినిమా మొత్తం ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. వెంకీ, చైతు కాంబో రీ ఫ్రెషింగ్ గా అనిపించడంతో ఆరంభం నుండే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మల్టీ స్టారర్ ను కోనా వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా వారు నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడుతుందేమో చూడాలి.