ఉద్యోగాలకు.. ఉగాదికి లింక్ ఉండాలి

ఉద్యోగాలకు.. ఉగాదికి లింక్ ఉండాలి

తెలుగుభాష బతకాలంటే ఉద్యోగాలకు.. ఉగాదికి లింక్ ఉండాలన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ రజతోత్సవ వేడుకల్లో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో సారస్వత పరిషత్ చారిత్రాత్మక పాత్ర పోషించిందంటూ ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. నిజాం కాలంలో తెలుగు ఆదరణ లేని సమయంలో అసాధారణ పాత్ర పోషించిందని.. తెలుగు భాష అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని పరిషత్ కాపాడిందని వెంకయ్య కొనియాడారు. తెలుగు భాష అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.