వ‌రుణ్‌తేజ్ మ‌రో ప్ర‌యోగం

వ‌రుణ్‌తేజ్ మ‌రో ప్ర‌యోగం

న‌వ‌త‌రం హీరోలు ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల‌కు వెల్‌కం చెబుతున్న రోజులివి. రానా, వ‌రుణ్‌తేజ్ ప్ర‌యోగాల్లో ఇత‌ర హీరోతో పోలిస్తే చాలానే స్పీడ్ చూపిస్తున్నారు. రానా ప్ర‌స్తుతం `హాతీ మేరా సాథీ`, 1945 అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టిస్తున్నారు. అలానే యువ‌హీరో వ‌రుణ్‌తేజ్ .. ఘాజి ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అంత‌రిక్షం నేప‌థ్యంలో భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్నాడు. 

వ‌రుణ్‌తేజ్ - సంక‌ల్ప్ ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ బిజీ. ఆ క్ర‌మంలోనే వ‌రుణ్ వేరొక ప్ర‌యోగాత్మ‌క క‌థాంశానికి ఓకే చెప్పాడ‌ట‌. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` క్రిటిక‌ల్‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రమ‌నే చెప్పాలి. స్వాతంత్య్రోద్య‌మ కాలంలో ... భార‌త్‌లో క్రికెట్ తొలి నాళ్ల‌లో ఎలా ఉండేదో ఆ చిత్రంలో చూపించాడు. శ్రీ‌విష్ణు పాత్ర చిత్ర‌ణ‌లో విప్ల‌వ భావ‌జాలం క‌నిపిస్తుంది. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌కి ఆ త‌ర‌హాలోనే ఓ విభిన్న‌మైన క‌థ‌ను చెప్పాడుట‌. డిసెంబ‌ర్‌లో సినిమా ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉందింకా.