మెగా కాంపౌండ్లోకి తేజ..!

మెగా కాంపౌండ్లోకి తేజ..!

చిత్రం ద్వారా తెలుగు సినిమా కు పరిచయమైన తేజ.. ఎన్నో హిట్ చిత్రాలు తీశాడు.  ఒకే మూస పద్దతిలో సినిమాలు తీస్తుండటంతో తేజ ప్రభావం చూపించలేకపోయారు.  నేనే రాజు నేనే మంత్రి ద్వారా బ్యాక్ బౌన్స్ ఇచ్చిన తేజకు వరసగా అవకాశాలు వచ్చాయి.  సురేష్ ప్రొడక్షన్ నుంచి సినిమా చేయాలని ఆఫర్ రావడంతో వెంకటేష్ తో సినిమా ఒకే అయింది.  ట్రయిల్ షూట్ అయ్యాక సినిమా ఆగిపోయింది.  కారణం, ఎన్టీఆర్ బయోపిక్.  ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించే అవకాశంర్ అవడంతో తేజ సురేష్ ప్రొడక్షన్ నుంచి బాలకృష్ణ గూటికి చేరారు.  అక్కడ కూడా ఎక్కువకాలం నిలవలేక పోయారు.  అక్కడి నుంచి బయటకు వచ్చి.. ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయబోతున్నట్టు తెలిపారు.  ఇది కూడా వర్కవుట్ కాలేదు.  

సినిమా టైటిల్ కూడా బయటకు వచ్చింది.  కాబోయే అల్లుడు అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ, అది కూడా వర్కవుట్ కాలేదు.  నెలల కాలంలో వరసగా మూడు సినిమా ప్రకటించి ఆగిపోయాడు.  ఇప్పుడు మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు తేజ.  మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేసేందుకు రెడీ అంటున్నాడు.  తేజ చెప్పిన కథ వరుణ్ కు నచ్చిందట.  వరుణ్ తేజ్ దర్శకుల హీరో.  దర్శకుడు ఎలా చెప్తే అలా ఫాలో అవుతాడు వరుణ్.  దర్శకుడు తేజాకు అలాంటి హీరోనే కావాలి.  సో, తేజ - వరుణ్ తేజ కాంబినేషన్లో త్వరలోనే సినిమా ఉంటుందన్నమాట.