అన్నయ్య మాటలే ఆయనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి : ఉత్తేజ్

అన్నయ్య మాటలే ఆయనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి : ఉత్తేజ్

టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ  సీరియస్ గా ఉన్నాడన్న వార్త కలకలం రేపింది. ఆయన లివర్ పాడైపోయిందని .. గచ్చిబౌలిలోని గ్యాస్ట్రో ఎంటరాలజీలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేస్తున్నారని.. ఆయనకు బి-నెగెటివ్ బ్లడ్ అత్యవసరం అంటూ వార్త వైరల్ అయ్యింది.ఈ వార్తలపై నటుడు ఉతేజ్ స్పందించారు. సుద్దాల అశోక్ తేజ అనారోగ్యం గా ఉన్నారన్న వార్తలు వాస్తవమేనని ఆయన అన్నారు. ఆయనకు రక్తం అవసరం కావడంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని అందించారని ఉతేజ్ వివరించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ద్వారా అభిమానులకు వివరించారు.