రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ఆ రాష్ట్రంలో ఎలాంటి జరిమానాలు విధిస్తున్నారో తెలుసా? 

రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ఆ రాష్ట్రంలో ఎలాంటి జరిమానాలు విధిస్తున్నారో తెలుసా? 

ప్రపంచంలో అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగానే సంభవిస్తున్నాయి. వాహన ప్రమాదాలను నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు విధించిన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  హెల్మెట్ పెట్టుకోకపోవడం, అతివేగంగా డ్రైవ్ చేయడం, మద్యం సేవించి డ్రైవ్ చేయడంతో పాటుగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి.  దీంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రమాదాలపై దృష్టి పెట్టింది.  రూల్స్ ను పాటించని వ్యక్తులకు భారీ జరిమానాలు విధిస్తున్నది. 

హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే రూ. 500, కారులో ప్రయాణం చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే రూ. 1000, మద్యం సేవించి డ్రైవ్ చేసినా, అంబులెన్స్ కు దారి ఇవ్వకున్నా, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినా రూ. 10వేలు ఫైన్  విధిస్తున్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ. 1000, రెండోసారి పట్టుబడితే రూ. 10వేలు ఫైన్ జరిమానా విధిస్తున్నారు.  అంతేకాదు పార్కింగ్ నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి రూ. 500 రెండోసారి రూ. 1500 జరిమానా కట్టాలి.  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5000 కట్టాల్సిందే.  అంతేకాదు, డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినా రూ. 10వేలు కట్టాల్సిందే అంటున్నారు. ఇక వాహనాల డిజైనింగ్ లో మార్పులు చేసి విక్రయిస్తూ పట్టుబడితే రూ. లక్ష కట్టాల్సిందే అంటోంది యోగి ప్రభుత్వం. వాహనదారుల భద్రతకు సంబంధించి కఠిన నియమాలు తీసుకోక తప్పడం లేదని అంటున్నారు అధికారులు.