'రైతు బంధు' ఎన్నికల గిమ్మిక్కే...

'రైతు బంధు' ఎన్నికల గిమ్మిక్కే...

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకువచ్చిన 'రైతు బంధు' పథకం ఎన్నికల గిమ్మిమ్మిక్కే అన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... రుణమాఫీ అంటే... కాంగ్రెస్ మాదిరిగా ఏకకాలంలో చేస్తారని రైతులు కేసీఆర్‌ని నమ్మారన్న ఉతమత్... మద్దతు ధర రాకుంటే ఇబ్బంది పడ్డ రైతులకు బోనస్ ఇవ్వటానికి మాత్రం కేసీఆర్ కి మనసు ఒప్పలేదన్నారు. కేసీఆర్ రైతుకు మేలు చేయకపోగా అణచివేత ధోరణిలో వ్యవహరించారని మండిపడ్డ ఉత్తమ్... గిరిజన రైతులకు సంకెళ్లు వేసి దేశద్రోహం కేసు పెట్టింది టీఆర్ఎస్ సర్కార్ కాదా? అని ప్రశ్నించారు. రైతుకు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వాల్సిందే... పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారాయన. 

అకాల వర్షంతో రైతు నష్టపోతే మాట్లాడని సీఎం కేసీఆర్ ఈరోజు గొప్పలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీకి చెంచాగిరి చేసింది నువ్వే కదా! అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేసిన ఉత్తమ్... నాలుగేళ్ల తర్వాత మద్దతు ధర గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. ఇక్క రూ.25 కూడా బోనస్ ఇవ్వని కేసీఆర్... కేంద్రం మాత్రం 25 శాతం ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నారని... ముందు రాష్ట్రంలో మీరు డిమాండ్ చేస్తున్న 25 శాతం ధర పెంచి రాష్ట్ర బడ్జెట్ నుండి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చినమాటకు కట్టుబడి ఉంది ఒక కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఉత్తమ్... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది... రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ ఏకకాలంలో చేస్తుందని వెల్లడించిన ఆయన... పంట భీమా పథకంలో ప్రీమియం కూడా మా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.