అమెరికాలో ఉద్యోగాలే ఉద్యోగాలు..

అమెరికాలో ఉద్యోగాలే ఉద్యోగాలు..

డొనాల్డ్ ట్రంప్‌ పుణ్యమాని అమెరికాలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ అగ్రరాజ్యంలో నిరుద్యోగం రేటు 18 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది. గత నెలతో పోల్చితే నిరుద్యోగం రేటు 0.2 శాతం తగ్గి 3.8 శాతానికి చేరింది. గత మే నుంచి ఇప్పటివరకు ఏకంగా 223,000 మందికి కొత్త కొలువులొచ్చాయి. నిర్మాణం, తయారీ, ప్రైవేటు సేవలు, విద్య, సేవల వంటి రంగాలు మెరుగైన ఫలితాన్ని అందించాయి. ముఖ్యంగా నిర్మణ రంగంలో 25,000 మందికి, తయారీ రంగంలో 18,000 మందికి ఉద్యోగాలొచ్చాయి. ఇక.. జీతాలు కూడా భారీగానే పెరిగాయి. ప్రైవేటు సెక్టార్‌ ఉద్యోగుల సగటు వేతనాల్లో 0.1 వృద్ధి కనిపించింది.