కరోనా వ్యాక్సిన్‌తో అమెరికా వ్యాపారం...అడ్డుకున్నందుకే WHOకు ట్రంప్‌ రాంరాం!

కరోనా వ్యాక్సిన్‌తో అమెరికా వ్యాపారం...అడ్డుకున్నందుకే WHOకు ట్రంప్‌ రాంరాం!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దూకుడు తగ్గడం లేదు...కరోనా సంక్షోభం, అమెరికాలో మాంద్యం, దేశంలో జాత్యాంకార హత్యలపై ఆందోళనలు,సెప్టెంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు....ఇవన్ని ఇప్పుడు ట్రంప్‌ను కనుకుతీయనీయడం లేదు..ఒక వైపు దేశంలో కరోనాను నియంత్రించడంలో ట్రంప్‌ విఫలం చేందాడని ప్రపంచ దేశాలు మాతమ్రే కాకుండా సొంత దేశ ప్రజలు విమర్శిస్తుండటంతో ట్రంప్‌ పరిస్థితి కుడిలోపడ్డ ఎలుకలా తయారైంది...దీంతో ఇప్పుడు ట్రంప్‌ అంతర్జాతీయ సంస్థలపై పడ్డాడు..

విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ  చైనా చేతిలో కీలుబమ్మగా మారింది గత కొంత కాలంగా విమర్శిస్తున్నాడు...దానికి ఆర్థిక సాయం తగ్గిస్తామని హెచ్చరించాడు...చివరికి WHO నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించారు..అదే విధంగా ప్రపంచ వాణిజ్య సంస్ధను రద్దు చేయాలని అది  మాకు ఉపయోగపడటం లేదని, చైనా ఆర్ధిక సామ్రాజ్యవాదిగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు..ప్రపంచ మానవ హక్కుల కమిషన్‌ తన స్వార్ధం తాను చూసుకొంటోందని ట్రంప్‌ దొంగ ఏడ్పులు ఏడుస్తోంది....ప్రపంచంలో మానవ హక్కులను కాపాడే ఏకైక దేశంగా ఫోజు పెట్టిన అమెరికా ఆచరణలో వాటిని హరించేదిగా మారింది...అమెరికాలో నల్ల జాతీయులను అణచివేస్తూ,వారి హక్కులను అణచివేస్తున్న ట్రంప్‌ ప్రపంచ మానవ హక్కుల మాట్లాడుతున్నారు...ఇంకా అనేక అంతర్జాతీయ సంస్ధల నుండి క్రమంగా వైదోలుగుతుంది...


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఏర్పాటులో అమెరికా ప్రముఖ పాత్ర పోషించింది...ప్రపంచీకరణను అమలు జరిపే సాధనంగా దాన్ని మార్చుకొని తన ప్రయోజనాలు సాధించుకోవాలని చూసింది...క్రమంగా అమెరికా వక్రబుద్ధి బయటపడుతుండటంతో...అంతర్జాతీయ సమాజం ముందు అమెరికాను దోషిగా నిలబెట్టె సంస్థలపై నిరూపించలేని ఆరోపణలు చేస్తూ, అందులో ఉంటే అంతర్జాతీయ సమాజానికి సమాధానం చెప్పాల్సి వస్తుందిని నెమ్మదిగా వాటి నుంచి తప్పుకుంటు తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది...తప్పుడు సాకులు చెబుతూ ఒక్కొక్క ప్రపంచ సంస్ధ నుంచి తాము తప్పుకుంటామని ప్రకటించటం లేదా బెదిరించటం ఇటీవలి కాలంలో అమెరికాకు మామూలైంది....దశాబ్దాల పాటు తామే అయి నడిపిన యాంకీలు ఇప్పుడు ఆ సంస్ధలనే తూలనాడుతున్నారు, బెదిరిస్తున్నారు... కరోనా వైరస్‌ను అవకాశంగా తీసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి బయటపడేందుకు పూనుకుంది... దీని చైనాను బూచిగా చూపుతోంది...ఇలా మరికొన్నింటి నుంచి కూడా తప్పుకొనేందుకు ట్రంప్‌ సిద్దమయ్యారు...


ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ విషయానికి వస్తే కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని ప్రకటించాలన్నది అమెరికా వత్తిడి తెచ్చింది.... దానికి ఆ సంస్ధ లొంగకపోవటంతో ట్రంప్‌ ఎదురుదాడి ప్రారంభించి చైనాతో కుమ్మక్కయిందని ఆరోపించాడు, ముందు నిధులు నిలిపివేస్తామని ప్రకటించి ఇప్పుడు ఏకంగా వైదొలుగుతామని బెదిరింపులకు దిగాడు.... కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి ప్రారంభమైందో దర్యాప్తు జరిపేందుకు చైనా సంస్థలను తమకు అప్పగించాలని అమెరికా ముందు డిమాండ్‌ చేసింది, అంతేకాదు, బాధిత దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని కేసుల నాటకం ఆడించింది....చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమావేశాల్లో తాము చెప్పిన పద్దతుల్లో దర్యాప్తు తీర్మానం చేయించాలని వత్తిడి తెచ్చింది...స్వతంత్ర సభ్యులతో దర్యాప్తు జరపవచ్చని దానికి తాము కూడా సహకరిస్తామని చైనా ప్రకటించడంతో అమెరికాకు మింగుడుపడం లేదు...
కరోనా వైరస్‌ నిరోధానికి తయారు చేసే వ్యాక్సిన్‌ ప్రజల వస్తువుగా ఉండాలి తప్ప ఒకటి రెండు సంస్ధలకు పేటెంట్‌ ఔషధంగా ఉండకూడదని కోస్టారికా చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్‌ తప్ప మిగిలిన సభ్యదేశాలన్ని ఏకగ్రీవంగా తీర్మానించాయి...ప్రపంచానికి మహమ్మారులుగా మారిన వ్యాధుల నివారణకు రూపొందించిన ఔషధాలు చౌకగా అందరికీ అందుబాటులో ఉండాలి తప్ప కొన్ని కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉండకూడదని నిర్ణయించాయి..


ఇప్పుడు కరోనా వాక్సిన్‌తో వ్యాపారం చేయాలన్నది అమెరికా, బ్రిటన్‌ ఆలోచన...ప్రపంచ ఆరోగ్య సంస్ధలో ఉంటూ ఇలాంటి చర్యలకు దిగుతే అమెరికన్లు ఈ సమాజం నుంచి మరింతగా వేరుపడతారు....ఇతర జబ్బులలాగా కరోనా వైరస్‌ లేదా మరొక వైరస్‌ దేనికీ ఒకసారి తయారు చేసిన వ్యాక్సిన్‌  శాశ్వతంగా పనికి రాదు... వైరస్‌లో మార్పులు జరిగినపుడల్లా మార్చాల్సి ఉంటుంది... అన్నింటికీ మించి ఎయిడ్స్‌ లాగా  కరోనా కోరి తెచ్చుకొనే జబ్బు కాదు, పైగా కరోనా కోరకుండానే వ్యాప్తి చెందుతుంది కనుక ప్రతి ఒక్కరూ భయంతో జీవించాల్సి ఉంటుంది, కనుక కరోనా వాక్సిన్‌కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రజలు,దేశాలు సిద్దపడతాయి...మహమ్మారులుగా మారినపుడు లక్షలు, కోట్ల మందికి సోకుతాయి... ఈ అవసరం, బలహీనతను సొమ్ము చేసుకోవాలని అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్‌ సంస్ధలు కాచుకు కూర్చున్నాయి...వాటి ఆకాంక్షలను ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్‌  పరోక్షంగా వెల్లడిస్తున్నాడు...


ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి అమెరికా వైదొలగాలని అమెరికా, బ్రిటన్‌ ఫార్మా కంపెనీలు, బడా కార్పొరేట్‌ సంస్ధల ఒత్తిడితో తెస్తున్నాయి...ఇప్పుడు కరోనా నేపథ్యంలో ,చైనాతో వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో WHO నుంచి బయటికి రావాలని మరింత ఒత్తిడి తెస్తున్నాయి...ఒక వేళ WHO  నుంచి బయటకు వస్తే ఎక్కువ నష్ట పోయేది అమెరికా తప్ప మిగతా ప్రపంచం కాదు.. ట్రంప్‌ వెనక్కి తగ్గి మరోసారి పునరాలోచిస్తామని చేప్పటం కొస మెరుపు...అయితే తీర్మానం నెగ్గి వెంటనే అమెరికా బయటకు పోతుందని ఎవరూ భావించటం లేదు....అదే జరిగితే ప్రపంచ వాణిజ్యం మీద ఐరోపా యూనియన్‌, చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది...