వైరస్‌పై పోరాటానికి  ఐదు కోట్లు ప్రకటించిన హాట్ బ్యూటీ ..!

వైరస్‌పై పోరాటానికి  ఐదు కోట్లు ప్రకటించిన హాట్ బ్యూటీ ..!

బాలీవుడ్  హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించిప్రతేకంగా పరిచయం చెయ్యాలిసిన అవసరం లేదు. తన అందం తో కుర్రకారు మతులు పోగొట్టడం ఉర్వశికి వెన్నతో పెట్టిన విద్య. నిజం గా దేవలోకం నుంచి దిగివచ్చిన ఉర్వశిలా ఉండే ఈ అమ్మడి అందాలకు ఫిదా కానీ మగాడు ఉండడేమో. ఈ  వయ్యారి లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యింది. అయినా అభిమానులకకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఊర్వశి. తాజాగా ఈ అమ్మడు కరోనా పై పోరాటానికి విరాళాన్ని ప్రకటించింది. 

ఎప్పుడు గ్లామర్ తో హాట్ టాపిక్ గా ఉండే ఈ కుర్రది ఇప్పుడు తన గొప్ప సేవాగుణంతో అందరిచేత శెభాష్ అనిపించుకుంటుంది. కరోనా వైరస్‌పై పోరాటానికి తనవంతుగా ఐదు కోట్ల రూపాయాలను  ప్రకటించింది ఊర్వశి.సోషల్ మీడియాలో ఈ అమ్మడిగా భారీ ఫాలోయింగ్ ఉంది. తన ఫాలోవర్స్ కి ఊర్వశి డ్యాన్స్ క్లాస్ కండక్ట్ చేసింది. దాంతో ఆమెకు భారీ మొత్తంలో డొనేషన్స్ అందాయి. 'ఇలాంటి క్లిష్ట సమయాల్లో సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. 2.5 కోట్ల మంది ఫాలోవర్స్​లో 1.8 కోట్ల మంది డ్యాన్స్‌ క్లాస్‌లో పాల్గొన్నారు. వారి సహకారంతో 5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాను. ఈ సాయం చిన్నదే కావచ్చు. మా ప్రయత్నం మాత్రం వృథా అవ్వలేదు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు' అని ఊర్వశి రౌతేలా పేర్కొంది.