రామ్‌చరణ్‌ భార్య ఇంట్లో విషాదం..ఆనారోగ్యంతో ఉపాసన తాతయ్య కన్నుమూత..

రామ్‌చరణ్‌ భార్య ఇంట్లో విషాదం..ఆనారోగ్యంతో ఉపాసన తాతయ్య కన్నుమూత..

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి....తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది...ఉపాసన తాతయ్య  కామినేని ఉమాపతిరావు కన్నుమూశారు... గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. వ‌య‌స్సు పైబ‌డ‌డం వ‌ల‌న ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్ట తెలుస్తుంది...
తెలంగాణ‌లోని దోమ‌కొండ‌లో జ‌న్మించిన ఉమాప‌తి రావు ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా పని చేశారు...ఆయ‌న మృతితో ఉపాస‌న భావోద్వేగానికి గురైంది... నిస్వార్థం, మానవత్వం, హాస్య చతురత ఉన్న ఆయ‌న ఉర్దూలో  రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే...మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత‌య్య’ అంటూ ఉపాసన ఎంతో భావోద్వేగ ట్వీట్‌ చేశారు...మీరంద‌రు క‌న్నీటి ద్వారా కాకుండా చిరున‌వ్వుతో ప్రేమని కురిపించాలంటూ స్ప‌ష్టం చేసింది. ఉపాస‌న స‌న్నిహితులు, మెగా అభిమానులు ఉమాప‌తి ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని ప్రార్ధిస్తున్నారు