సినీ కార్మికులకు సహాయం అందిస్తున్న మెగా కోడలు.. ఎలా అంటే..?

సినీ కార్మికులకు సహాయం అందిస్తున్న మెగా కోడలు.. ఎలా అంటే..?

ప్రస్తుతం మన దేశాన్ని హడలెత్తిస్తోంది కరోనా. ఈ వైరస్ కారణంగా అని సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. దాంతో పేద సినీ కార్మికులు చాల కష్టాలు ఎదుర్కుంటున్నారు. అయితే వారికీ సహాయం చేయడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ(సిసిసి) ని స్థాపించి సినీ ప్రముఖుల వద్ద నుండి విరాళాలు సేకరించి వారికీ సహాయం అందిస్తున్నారు మెగా స్టార్ చిరంజీవి. అయితే ఇప్పుడు ఆ చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య కూడా సినీ కార్మికులకు సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. వారందరికి అపోలో మెడికల్ స్టోర్స్ లో ఉచితంగా మందులు అందజేస్తుంది ఉపాసన. అర్హత ఉన్న సినీ కార్మికులకు ఉచితంగా వారికి అవసరమైన మందులను అందించాలని నిర్ణయం తీసుకుందట ఉపాసన. ఈ విషయానికి సంబంధించి అని అపోలో మెడికల్ స్టోర్స్ కు ఆదేశాలు జారీ చేసే పనిలో ఉందట ప్రస్తుతం. అయితే ఈ విషయం తెలుసుకున్న వారు అందరూ ఉపాసన పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.