సినీనటుడు మోహన్ బాబు ఇంటివద్ద కలకలం... 

సినీనటుడు మోహన్ బాబు ఇంటివద్ద కలకలం... 

ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర కలకలం రేగింది.  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారుతో సహా ఇంట్లోకి వెళ్లి మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించినట్టు తెలుస్తోంది.  మిమ్మల్ని వదలబోమంటూ బెదిరించడంతో భయపడిన మోహన్ బాబు కుటుంబ సభ్యులు పహాడీ షరీఫ్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కారు ఇంట్లోకి దూసుకొచ్చిన సమయంలో గేటు దగ్గర వాచ్ మెన్  లేకపోవడంతో కారు లోపలికి వచ్చినట్టు తెలుస్తోంది.  ఏపీ 31 ఏఎస్ 0004నెంబర్ గల ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్టు పోలీసుల ఫిర్యాదులో మోహన్ బాబు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.  కారులో మొత్తం నలుగురు దుండగులు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును అందుకున్న పోలీసులు దర్యాప్తు  ప్రారంభించారు.  దుండగులు ఎవరు... మోహన్ బాబు  ఫ్యామిలీ ఎందుకు హాని తలపెట్టాలని అనుకున్నారు... ఇది శతృవులు చేసిన పనేనా లేక ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.