ఈ నెలలో మరింత అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.. కేంద్ర‌మంత్రి సూచ‌న‌

ఈ నెలలో మరింత అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.. కేంద్ర‌మంత్రి సూచ‌న‌

ఈ నెల‌లో ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి.. హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలి టిమ్స్, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, గాంధీ హాస్పిటల్స్ ని సందర్శించిన ఆయ‌న‌..  క‌రోనా బాధితుల‌కు అందుతోన్న వైద్యం, వసతులను పరిశీలించారు.. టిమ్స్ లో వసతులపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి.. టిమ్స్ లో వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.. అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది.. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలి అని సూచించారు. కరోనాను కట్టడి చేస్తోన్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాల‌న్న కిష‌న్‌రెడ్డి.. వైద్య సిబ్బందికి జీతాలతో పాటు.. అదనంగా ఇన్సెంటివ్స్ అందించాల‌న్నారు. ఇదే స‌మ‌యంలో.. కరోనా బారినపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిల్లో చికిత్స తీసుకోవాల‌ని.. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దు అని విజ్ఞ‌ప్తి చేశారు.

ఇక‌, ప్రభుత్వ ఆస్ప‌త్రుల‌పై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు కిష‌న్‌రెడ్డి.. ప్రైవేట్ ఆస్ప‌త్రులే దిక్కు అనే ఆలోచనకు ప్రజలు వచ్చారు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరోనా పేషెంట్స్ బయట తిరుగుతున్నారు.. ప్రభుత్వం పట్టించుకోవడం లేద‌ని ఫైర్ అయిన ఆయ‌న‌.. బయట తిరుగుతోన్న హోమ్ ఐసోలేషన్‌లోని రోగుల‌ను ప్రభుత్వం గుర్తించాల‌ని సూచించారు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు గడప దాటి బయటకు రావొద్దు.. ఆగస్టు నెలలో ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలి అని కోరారు.. తెలంగాణలో చాలా తక్కువ టెస్ట్ లు చేస్తున్నారు.. టెస్ట్ ల సంఖ్య పెంచాలి.. టెస్టింగ్ సెంటర్లు పెంచాలి.. ప్రభుత్వ దవాఖానాలు పెంచాల‌ని కీల‌క సూచ‌న‌లు చేశారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి.