బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం...స్పెషల్ ఫ్లైట్ లు 

బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం...స్పెషల్ ఫ్లైట్ లు 


భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరగడంతో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో ఉన్న తమ దేశ పౌరులను బ్రిటన్ తరలించాలని నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేకమైన చార్టెర్డ్ విమానాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 8 నుంచి 12 వరకు గోవా, ముంబై, న్యూ ఢిల్లీ లో మొత్తం ఏడు 
చార్టెర్డ్ ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. ఇండియాలో ఉన్న బ్రిటన్ పౌరులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు. దేశంలో మొత్తం 35 వేలమంది బ్రిటన్ వాసులు చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. వారిలో 20 వేల మంది వరకు బ్రిటిష్ హై కమిషన్‌ను సంప్రదించి తమను తక్షణం స్వదేశానికి తీసుకు వెళ్లే ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. వారి కోసం ఏర్పాటు చేసిన విమానాలు దేశంలో న్యూ ఢిల్లీ, ముంబై, గోవాల నుంచి ఈ నెల 8 నుంచి 12 తేదీల మధ్య బయల్దేరనున్నాయి. 

బ్రిటన్‌కు వెళ్లే విమానాల వివరాలు 
• ముంబయి నుంచి ఏప్రిల్ 9,11 తేదీలలో 
• ఢిల్లీ నుంచి ఏప్రిల్ 9,11 తేదీలలో 
• గోవా నుంచి ఏప్రిల్ 8,10,12 తేదీలలో