పళ్ళు, కూరగాయలపై యూఏఈ నిషేధం

పళ్ళు, కూరగాయలపై యూఏఈ నిషేధం

నిఫా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా కేరళ నుంచి కాయగూరలు, పళ్ళ దిగుమతిపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) నిషేధం విధించింది. ఈ మేరకు యూఏఈకి చెందిన క్లయిమేట్‌ ఛేంజ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. దుబాయ్‌, షార్జా, అజమన్, ఉమ్మల్‌ క్వాయిన్‌, రస్‌ అల్‌ ఖైమా, ఫుజారియా మున్సిపాలిటీలకు చెందిన అధికారులతో పాటు అబు దబి ఫుడ్‌ కంట్రోల్‌ అథారిటీకి చెందిన అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో ఈ వ్యాధి గురించి జారీ చేసిన హెచ్చరికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు యూఈఇ అధికారులు తెలిపారు.

Photo: FileShot