కరోనా ఎఫెక్ట్.. డబ్ల్యూహెచ్‌వోను టార్గెట్‌ చేసిన ట్రంప్

కరోనా ఎఫెక్ట్.. డబ్ల్యూహెచ్‌వోను టార్గెట్‌ చేసిన ట్రంప్

కరోనా అమెరికాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్-19 దెబ్బకు అమెరికన్లు పిట్టల్లా రాలిపోతున్నారు. న్యూయార్క్‌లో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. అమెరికాలో మరణాల సంఖ్య భారీగా పెరుగున్న క్రమంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజంగా తమను మోసంచేసి దెబ్బతీసిందని మండిపడ్డారు. అమెరికా నుంచి పెద్ద మొత్తంలో నిధులు అందుకుంటున్నప్పటికీ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో.. చైనీయులను అమెరికాలోకి అనుమతించవచ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదనలు చేసిందని ఆరోపించారు ట్రంప్. ఇలాంటి తప్పుడు సలహాలు ఎందుకు ఇచ్చారంటూ ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు ప్రెసిడెంట్. అంతే కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిధులను ఉపసంహరించుకుంటామని బెదిరించారు.