ప్రాణం తీసిన రైతుబంధు..

ప్రాణం తీసిన రైతుబంధు..

ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఇచ్చిన చెక్కులను ఆనందంగా తీసుకుని.. ఆ చెక్కును డ్రా చేసుకుందామని సంతోషంతో బ్యాంకుకు వెళ్లిన ఇద్దరు రైతన్నలు ఆ సొమ్ము కళ్లారా చూసుకోకుండానే కన్నుమూశారు. మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు రైతన్నలు రైతుబంధు పథకం కింద వచ్చిన చెక్కులను డ్రా చేసుకుందామని బ్యాంకులకు వెళ్లారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. వడదెబ్బకు గురై సొమ్మసిల్లిపడిపోయారు. తోటి రైతులు ఆసుపత్రికి తరలించేలోపే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కావడంతో డబ్బు డ్రా చేసుకునేందుకు పెద్దసంఖ్యలో రైతులు బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. రద్దీకి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడం.. గంటల తరబడి ఎండలో నిలబడటంతోనే వారు మరణించారని తోటి రైతులు ఆరోపిస్తున్నారు.