పాస్‌వర్డ్‌లు మార్చండి..

పాస్‌వర్డ్‌లు మార్చండి..

మీకు ట్విటర్‌ ఖాతా ఉందా? ఉంటే.. తక్షణమే అకౌంట్‌ పాస్‌వర్డ్‌ను మార్చుకోండి. దాదాపు 330 మిలియన్‌ మంది వినియోగదారులు పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని ట్విటర్‌ సూచించింది. కొద్ది రోజుల క్రితం ట్విటర్‌లో సమస్యను గుర్తించడంతో ఆ సంస్థ దర్యాప్తు చేపట్టింది. పాస్‌వర్డ్‌ల చోరీ జరిగిందా? అనే విషయమై విచారణ చేసింది. పాస్‌వర్డ్‌లను దుర్వినియోగ పరిచినట్టు ఎలాంటి సంకేతాలూ లేనప్పటికీ  పాస్‌వర్డ్‌ను మార్చుకుంటే మేలని తెలిపింది. ప్రస్తుతం సేవ్‌ అయి ఉన్న పాస్‌వర్డ్‌లన్నింటిన్నీ తొలగించామని, ఇక పాస్‌వర్డ్‌లు కనిపించవని ట్విటర్‌ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొంది. ఈ విషయమై మరే వివరాలనూ ట్విటర్‌ వెల్లడించనప్పటికీ.. కొన్ని వారాల క్రితం బగ్‌ను ట్విటర్‌ గుర్తించిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాస్‌వర్డ్‌లను స్టోర్‌ చేసే ఆ బగ్‌ను ఫిక్స్‌ చేసినప్పటకీ, ముందు జాగ్రత్తగా అందరూ పాస్‌వర్డ్‌లు మార్చుకుంటే మంచిదని ట్విటర్‌ సూచించిందని భావిస్తున్నారు.