అక్కడ మిడతలకు మంచి డిమాండ్..కిలో రూ.20..!

అక్కడ మిడతలకు మంచి డిమాండ్..కిలో రూ.20..!

ఓ వైపు కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తుంటే మరో వైవు మిడతలు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిడతలు అరికట్టడానికి పాక్ లో అధికారులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు, పాకిస్థాన్ లోని  ఒకరా జిల్లలో అధికారులు మిడతలు పట్టించిన వారికి కిలోకు 20రూపాయలు ఇస్తున్నారు. దీంతో పోటీ పది మరీ రాజాలు మిడతలు పట్టుకోడానికి ఎగబడుతున్నారు. అయితే మిడతలను కొనేది పంటలను రక్షించటానికి మాత్రమే కాదు..వాటిని కోళ్ల పరిశ్రమలకు అమ్ముతూ మిడతలను నివారిస్తున్నారు. కోళ్ల పరిశ్రమలో మిడతను కోళ్లకు ఆహారంగా వాడుతారు. కిలో సోయాబీన్ కొని కోళ్లకు దాణాగా వేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అంతే కాకుండా మిడతల్లో కంటే సోయాలో ప్రోటీన్ లు తక్కువగా ఉంటాయి. దాంతో కోళ్ల పరిశ్రమ యజమానులు మిడతలను కొనడానికే మొగ్గు చూపుతున్నారట.