ఏపీకి టీటీడీ భారీ విరాళం... ఎంతంటే...  

ఏపీకి టీటీడీ భారీ విరాళం... ఎంతంటే...  

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 303 మందికి పైగా కరోనా బారిన పడ్డారు.  రోజు రోజుకు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీని ఆదుకోవకానికి చాలామంది ముందుకు వస్తున్నారు.  ఇప్పటికే చాలామంది విరాళాలు అందిస్తున్నారు.  ఈ బాటలో ఇప్పుడు టిటిడి కూడా చేరిపోయింది.  ఆంధ్రప్రదేశ్ కు రూ. 19 కోట్ల రూపాయల విరాళం అందిస్తున్నట్టు టిటిడి పేర్కొన్నది.  

ఇప్పటికే కరోనాపై ఫైట్ చేసేందుకు చిత్తూరు జిల్లాకు రూ.8 కోట్ల రూపాయల సహాయం చేసినట్టు టీటీడీ పేర్కొన్నది.  త్వరలోనే మిగతా రూ. 11 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయబోతున్నట్టు తెలిపారు.  అదే విధంగా రోజుకు 20 లక్షలమందికి ఆహారం అందిస్తున్నట్టు టిటిడి పేర్కొన్నది.  ఉదయం నుంచి రాత్రి వరకు 20 లక్షల ఆహార ప్యాకెట్లను టిటిడి పంపిణి చేస్తున్నట్టు తెలిపారు.  లాక్ డౌన్ ముగిసేవరకు ఆహారం సరఫరా చేస్తామని టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ సింఘాల్ పేర్కొన్నారు. అదే విధంగా నిరాశ్రయులకు తిరుమల విశ్రాంతి నివాసాల్లో ఆశ్రయం కల్పిస్తున్నట్టు తెలిపారు.   ఆగమశాస్త్ర నియమాల ప్రకారం స్వామివారిని అన్ని రకాల కైంకర్యాలు జరుగుతున్నాయని అనిల్ సింఘాల్ పేర్కొన్నారు.