తిరుమలలో కొత్త మార్గదర్శకాలు...గంటకు 300 మందికి అనుమతి...

తిరుమలలో కొత్త మార్గదర్శకాలు...గంటకు 300 మందికి అనుమతి...

తిరుమల శ్రీవారి దేవాలయం గత రెండు నెలలుగా భక్తులకు అనుమతి లేదు. శ్రీవారు కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.  లాక్ డౌన్ 5 లో మరికొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 8 వ తేదీ నుంచి దేవాలయాలు తెరిచేందుకు అనుమతులు ఇవ్వడంతో తిరుమల దేవస్థానం కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం గంటకు 300 మందికి శ్రీవారి దర్శనం కలిగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  అదేవిధంగా, గదుల విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఇచ్చింది. దీంతో పాటు ఒక్కో గదిలో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది.  కొన్నిరోజులపాటు అన్నదానం ఉండదు. అంతేకాదు, శ్రీవారి ఆలయం సమీపంలో షాపులు కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది టీటీడీ బోర్డు.