రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుక

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుక

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2786 ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ జారీ చేసింది. గ్రూప్‌-4లో 1421, ఆర్టీసీలో 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ విభాగంలో మరో 774 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 8 నుంచి జూలై 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 2న పరీక్ష జరగనుంది. టీఎస్‌పీఎస్సీ ప్రకటనతో రాష్ట్రంలోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

…ఆర్టీసీలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు జూన్ 7 నుంచి జులై 6వ తేదీ వరకు  దరఖాస్తుల స్వీకరణ.. అక్టోబర్‌ 7న పరీక్ష.

…ఏఎస్‌వో  పోస్టులకు ఈ నెల 8 నుంచి జులై 2 వరకు దరఖాస్తుల స్వీకరణ. సెప్టెంబర్‌ 2న పరీక్ష నిర్వహణ.

… వీఆర్వో ఉద్యోగాలకు ఈ నెల 8 నుంచి జులై 2 వరకు దరఖాస్తుల స్వీకరణ .. సెప్టెంబర్ 16న రాత పరీక్ష ఉంటుందన్నారు అధికారులు.

విభాగాల వారిగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు…

వీఆర్వో-700

సీనియర్ స్టెనో(రెవెన్యూ)-19

ఏఎస్‌వో- 479

ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్: 72

ఎల్‌డీ/ జూనియర్ స్టెనో-15

టైపిస్ట్(రెవెన్యూ)-292

జూనియర్ అసిస్టెంట్(రెవెన్యూ)-217

జూనియర్ అసిస్టెంట్ పంచాయతీ రాజ్- 53

టైపిస్ట్(పంచాయతీ రాజ్)-64

జూనియర్ అసిస్టెంట్(కమర్షియల్ ట్యాక్స్)-231

జూనియర్ అసిస్టెంట్(ఫారెస్ట్)-32

జూనియర్ అసిస్టెంట్(హోం)-22

జూనియర్ స్టెనో(హోం)-335

టైపిస్ట్(హోం)-79

జూనియర్ అసిస్టెంట్(I&CAD)-92

జూనియర్ స్టెనో(I&CAD)-9

జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్)-2

జూనియర్ స్టెనో(ఫైర్ సర్వీస్)-1

మెడికల్ & హెల్త్ డిపార్ట్ మెంట్-77