టీఎస్ఐసెట్ ఫలితాలు విడుదల

టీఎస్ఐసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం విడుదలయ్యాయి.  టీఎస్ సీహెచ్‌ఈ చైర్మన్‌ పాపిరెడ్డి మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. టీఎస్ఐసెట్‌లో మొత్తం 90.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం 55,191 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్షకు హాజరవ్వగా.. 49,812 మంది అర్హత సాధించారు. 15 రోజుల్లో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు.