క‌రోనా విజృంభణ... జీహెచ్ఎంసీ ప‌రిధిలో స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా విజృంభణ... జీహెచ్ఎంసీ ప‌రిధిలో స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. ముఖ్యంగా క‌రోనా వైర‌స్‌గా హాట్‌స్పాట్‌గా మారిన హైద‌రాబాద్‌లో భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి.. ఇక‌, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన అన్ని ప్ర‌ధాన కార్యాల‌యాలు ఉండ‌డంతో.. స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో భౌతిక‌దూరం పాటించేలా.. గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరి కొంత కాలం రొటేషన్ పద్ధతిని కొన‌సాగించాని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.. ఇప్ప‌టికే ఈ ప‌ద్ధ‌తి కొన‌సాగుతుండ‌గా.. గ‌తంలో ఇచ్చిన స‌ర్క్యుల‌ర్ గ‌డువు నిన్న‌టితో ముగిసింది.. మ‌ళ్లీ దీనికి కొన‌సాగింపు ఉంటుందా? లేదా? అని ఉద్యోగులు ఎదురుచూస్తోన్న స‌మ‌యంలో.. మ‌రోసారి రొటేష‌న్ ప‌ద్ధ‌తిని పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం.