మరికొద్ది సేపట్లో ఎంసెట్‌ ఫలితాలు...

 మరికొద్ది సేపట్లో ఎంసెట్‌ ఫలితాలు...

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ఫలితాలు మరికొద్ది సేపట్లో రానున్నాయి. శనివారం సాయంత్రం నాలుగు గంటకు విడుదల కావాల్సిన ఎంసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం ఒంటి గంటకే విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1,36,311 మంది, అగ్రికల్చర్‌ పరీక్షకు 66,857 మంది హాజరయిన విషయం తెలిసిందే. ర్యాంకులను www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.