నేడు తెలంగాణ ఎంసెట్ రీషెడ్యూల్ ప్రకటన

నేడు తెలంగాణ ఎంసెట్ రీషెడ్యూల్ ప్రకటన

ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన రీ షెడ్యూల్‌ను ఇవాళ వెల్లడించనుంది తెలంగాణ ఉన్నత విద్యామండలి.  ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షను జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. జూలై 8 లేదా 10 నుంచి ఎంసెట్ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ దీనిపై చర్చించి సెట్స్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.