తొలిసారి ట్రంప్‌ ఇఫ్తార్‌ విందు

తొలిసారి ట్రంప్‌ ఇఫ్తార్‌ విందు

రంజాన్‌ మాసం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు. బుధవారం అధ్యక్షుడు ఇఫ్తార్‌ విందు ఇస్తారని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి తెలిపారు. విందుకు ఎవరెవరిని ఆహ్వానిస్తారో తెలియాల్సి ఉంది. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఇఫ్తార్‌ విందు ఇవ్వడం ఇదే తొలిసారి. 1805లో అప్పటి అధ్యక్షుడు థామస్‌ జెఫర్‌సన్‌  రంజాన్‌కు ముందు వైట్‌హౌస్‌లో తొలిసారి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆ త‌ర్వాత 1996లో అప్పటి ఫ‌స్ట్ లేడీ హిల్ల‌రీ క్లింట‌న్ ఈ సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. కానీ గతేడాది ఇఫ్తార్‌ విందు ఇవ్వడానికి ట్రంప్‌ నిరాకరించారు.