యూఎస్ హామీ:  కోవిడ్ 19 వాక్సిన్ ముందుగా ఇండియాకే... 

యూఎస్ హామీ:  కోవిడ్ 19 వాక్సిన్ ముందుగా ఇండియాకే... 

అమెరికాలో రోజు రోజుకు వైరస్ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతున్నది.  అయితే, మొదట అమెరికా అంచనా వేసిన దానికంటే మరణాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే.  ఇక ఇండియా నుంచి హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ ను దిగుమతి చేసుకునే విషయంలో అయన ఇప్పటికే ఇండియాతో సంప్రదింపులు జరిపారు.  

మానవతా దృక్పధంతో ఇండియా ఈ మెడిసిన్ ను ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.  ప్రముఖ మీడియా ఫాక్స్ కు ట్రంప్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఆ ఇంటర్వ్యూ లో అనేక విషయాలు పేర్కొన్నారు.  ముఖ్యంగా మోడీకి తనకు జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి పేర్కొన్నారు.  యూఎస్ కోవిడ్ 19 వ్యాక్సిన్ పరిశోధనలు చేస్తోందని, క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, ట్రయల్స్ పూర్తయ్యి వ్యాక్సిన్ రెడీ అయితే మొదట ఇండియాకు ఈ మెడిసిన్ ను ఎగుమతి చేస్తామని మోడీకి హామీ ఇచ్చామని, ఈ హామీ తరువాత మోడీ హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ ను ఎగుమతి చేసేందుకు అంగీకరించారని, పరస్పరం రెండు దేశాలు కరోనాపై పోరాటం చేస్తున్నాయని ట్రంప్ ఫ్యాక్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.