అలిగిన ట్రంప్

అలిగిన ట్రంప్

కెనడాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర సభ్య దేశాధి నేతల మధ్య భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. ట్రంప్, మిగతా ఆరుగురు నేతల మధ్య గతంలోనే విభేదాల ఉన్నాయి. వాణిజ్య పోరు ఒక్కటే కాదు.. వాతావరణ మార్పులు, ఇరాన్ అణు ఒప్పందం, ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం వంటివన్నీ వీరి మధ్య విభేదాలకు కారణం.  

ఈ నేపథ్యంలో ట్రంప్ జీ-7 సమ్మిట్ ముగిసే వరకు కెనాడాలో ఉండటం లేదు. సదస్సు ముగియడానికి ముందే కెనడా నుంచి సింగపూర్ కు వెళుతున్నారు. ఈనెల 12న కిమ్ తో జరిగే భేటీకి సిద్ధం కావటానికి ఆయన ముందుగానే వెళుతున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. జీ-7లో వాతావరణం మార్పులపై జరిగే సమావేశానికి ఆయన హాజరుకావటం లేదని స్వేతసౌదం ప్రకటంచింది.  సంప్రదాయంగా గతం నుంచి వస్తున్న ఉండే ఫోటో సెషన్ లో కూడా ట్రంప్ పాల్గొనరు.