ట్రంప్‌, కిమ్ భేటీ అక్క‌డే..

ట్రంప్‌, కిమ్ భేటీ అక్క‌డే..

సింగపూర్‌లోని  సెంటోసా ఐలాండ్‌ రిసార్ట్‌లోని ఫైవ్ స్టార్ హోటల్ క‌పెల్లాలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌,  ఉత్తర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌లు   భేటీ కానున్నారు. ఈ  12వ తేదీన వీరిద్ద‌రి మ‌ధ్య‌ చర్చలు జ‌రుగుతాయి.  పాల్గొననున్నారు.  అత్యంత ఖ‌రీదైన భ‌వ‌నాల‌తో కూడిన సెంటోసా ద్వీపాన్ని భ‌ద్ర‌తా కారాణాల దృష్ట్యా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.  భారీ ప్రహరీతో నిర్మించిన కపెల్లా హోటల్  అత్యంత సురక్షిత ప్రాంతమ‌ని భ‌ద్ర‌తా అధికారులు ధృవీక‌రించారు.  జూన్‌10 నుంచి 14వ తేదీ వరకు ఇక్క‌డ బాధ్య‌త‌లు నిర్వ‌హించే పోలీసులకు ప్రత్యేక అధికారాలను ఇస్తూ సింగపూర్‌ ప్రభుత్వం ఇప్ప‌టికే ఉత్తర్వులు జారీ చేసింది.