త్వరలో కిమ్‌, ట్రంప్‌ భేటీ

త్వరలో కిమ్‌, ట్రంప్‌ భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్‌ అతి త్వరలో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెలాఖరు లేదా జూన్ ప్రారంభంలో కిమ్‌తో సమావేశం కానున్నట్టు ట్రంప్‌ వెల్లడించారు. చర్చలకు సంబంధించి ఈ రెండు దేశాలూ తెర వెనుక మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. క్షిపణి పరీక్షలు, అణుదాడి హెచ్చరికల తర్వాత నేరుగా చర్చలు జరిపి వివాదాలను పరిష్కరించుకుంటేనే మేలని ఇటీవల ట్రంప్‌, కిమ్‌ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అణ్వాయుధాలు వీడితేనే చర్చలకు అవకాశం ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది. దీంతో.. ట్రంప్‌, కిమ్‌ బేటీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. వీటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ చర్చల ప్రక్రియ ముందుకు సాగుతుందని ట్రంప్‌, కిమ్‌ సూచనలిచ్చారు.