60 ల‌క్ష‌ల మంది టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు బీమా.. ప్రీమియం చెల్లింపు

60 ల‌క్ష‌ల మంది టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు బీమా.. ప్రీమియం చెల్లింపు

త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటోంది టీఆర్ఎస్ పార్టీ.. ప్ర‌తీ ఏడాది పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌మాద‌బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తూ వ‌స్తోంది.. దీనికి సంబంధించిన మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి పార్టీయే చెల్లిస్తోంది.. ఇక‌, ఈ సారి.. 60 ల‌క్ష‌ల మంది టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌మాద‌బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తోంది పార్టీ.. దీనికి సంబంధించిన రూ.16.11 కోట్ల బీమా ప్రీమియాన్ని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి అంద‌జేశారు మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. యునైటెడ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక‌, పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన కేటీఆర్.. పార్టీ అభివృద్ధి కార్య‌క్ర‌మాలను వివ‌రించారు.