శ్రావణ మాసంలో జిల్లా పార్టీ ఆఫీసులు ప్రారంభోత్సవం?

శ్రావణ మాసంలో జిల్లా పార్టీ ఆఫీసులు ప్రారంభోత్సవం?

అధినేతలే డెడ్‌లైన్‌ పెట్టారు. టార్గెట్‌ ఫిక్స్‌ చేశారు. గడువు ముగిసింది. కానీ.. ఎంతమంది లక్ష్యాన్ని చేరుకున్నారు? ఆయన మాటను రామబాణంలా భావించి ఎంతమంది చురుకుగా పనిచేశారు? శ్రావణ మాసంలో పార్టీ పరంగా సందడి చేయబోతున్న అంశం ఏంటి? లెట్స్‌ వాచ్‌. 

గత ఏడాది దసరా లోపు పూర్తి చేయాలన్నది డెడ్‌లైన్‌!

తెలంగాణలో సంస్థాగతంగా బలోపేతం కావడానికి ఫోకస్‌ పెట్టిన TRS  జిల్లా కేంద్రాల్లో పార్టీ  ఆఫీసుల నిర్మాణానికి పూనుకుంది. గత ఏడాది జులైలో తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో 30 నిర్మాణాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌. ఒక్కో పార్టీ కార్యాలయం నిర్మాణానికి  60 లక్షల రూపాయల చెక్‌,  ఆఫీసు నిర్మాణ ప్లాన్‌ అందజేశారు. ఎకరం స్థలంలో వెయ్యి పదిహేను వందల మంది కూర్చునే విధంగా ఒకే నమూనాలో సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది దసరా లోపు నిర్మాణం పూర్తి చేయాలన్నది డెడ్‌లైన్‌. ఇదే విషయంపై పలుమార్లు పార్టీ సమీక్ష కూడా చేసింది.

నేతలు చురుకుగా ఉన్నచోటే పనులు పూర్తయ్యాయా?

మరి.. పార్టీ అధినేత పెట్టిన డెడ్‌లైన్‌కు అనుగుణంగా లక్ష్యం చేరుకున్నది ఎంత మంది అని ఆరా తీస్తే.. సగం మందే అని లెక్క తేలారట. పార్టీ కార్యాలయాల నిర్మాణ బాధ్యతలు తీసుకున్న వారిలో చాలా మంది యాక్టివ్‌గా పనిచేయలేదని తేలిపోయింది. ఎక్కడైతే చురుకైన నాయకులు ఉన్నారో అక్కడే  పార్టీ ఆఫీసు నిర్మాణాలు పూర్తయ్యాయట. ఇలా పనులు కొలిక్కి వచ్చిన పార్టీ ఆఫీసులను  శ్రావణ మాసంలోనే  సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌  ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రారంభిస్తారని  అనుకుంటున్నారు. 

అక్కడ సిద్ధమైనా.. ఇక్కడెందుకు నత్తనడకన పనులు?

రంగారెడ్డి, వికారాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్‌, కొత్తగూడెం, కామారెడ్డి తదితర జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ ఆఫీసు నిర్మాణ పనులు పూర్తి కాలేదని సమాచారం. వీటిని కూడా త్వరగా కంప్లీట్‌ చేయాలని తెలంగాణ భవన్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయట. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కొన్ని జిల్లాల్లో ప్రారంభోత్సవానికి  కార్యాలయాలు సిద్ధంగా ఉండటం.. మరికొన్నిచోట్ల నత్తనడకన సాగడంపై పార్టీలో చర్చ జరుగుతోందట. 

వీరెందుకు పూర్తి చేయలేదు?

వారెలా టైమ్‌కు కంప్లీట్‌ చేయగలిగారు.. వీరెందుకు  పూర్తి చేయలేదని ఆరా తీస్తున్నారట. కొంతమంది కరోనా, ప్రకృతి సహకరించలేదని చెబుతున్నా.. వారికి లేని ఇబ్బందులు వీరికేంటని ప్రశ్నించుకుంటున్నారట. దీంతో పార్టీ ఆదేశాల ప్రకారం సకాలంలో పూర్తి చేసింది ఎవరు.. చేయలేంది ఎవరు అని ఆరా తీస్తున్నారట. ఇదే అధికార పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్‌.