నాకెప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదు

నాకెప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదు

నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ తరహా ఘటనలు ఎదురుకాలేదన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఐడబ్ల్యూపీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇష్టాగోష్టిలో మహిళా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. వేల కోట్లు రుణాలు మాఫీ చేసినా.. రైతులు మళ్లీ అప్పుల పాలవుతున్నారని.. వారిని ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకే రైతు బంధు పథకం తెచ్చామని కవిత స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో ఉత్తర, దక్షిణ భారతదేశాలనే వాదనలు ఎక్కువగా వినిపిస్తోందని.. అలాంటి భేదాలు వద్దని.. మనమందరం భారతీయులమని ఆమె అన్నారు. ఇక ఫెడరల్ ఫ్రంట్ గురించి చెబుతూ.. మా ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని.. మా ఎజెండా, లక్ష్యాలు నచ్చిన వారందరికీ ఎప్పుడూ తలపులు తెరిచే ఉంటాయన్నారు. బీజేపీతో సన్నిహితంగా ఉండటం లేదని.. కానీ మోడీ ప్రభుత్వంతో వర్కింగ్ రిలేషన్స్ మాత్రం ఉన్నాయని కవిత అన్నారు.