పెళ్లంటూ చేసుకుంటే అక్కడే అంటున్న హీరోయిన్

పెళ్లంటూ చేసుకుంటే అక్కడే అంటున్న హీరోయిన్

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన చిన్నది త్రిష . ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి వరుస విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో సినిమాలు లేవు. ఇటీవల మెగాస్టార్ సినిమా లో  త్రిషకు ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. త్రిషను ఎప్పుడు పెళ్లి మాట అడిగిన నైస్ గా తప్పించుకునేది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన త్రిష తన పెళ్లి గురించి, కెరీర్ గురించి మాట్లాడింది.

`దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నాకు గుర్తింపు ఉంది. ఏ భాష నుంచి అవకాశం వచ్చినా తప్పకుండా నటిస్తా అని త్రిష అంటుంది . నా పెళ్లి గురించి ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. నాకు తెలియకుండానే పెళ్లి గురించి, డేటింగ్ గురించి ప్రచారం జరిగిపోతూ ఉంటుంది. నేను ప్రేమ వివాహమే చేసుకుంటా. నాకు లాస్ వేగాస్ అంటే ఇష్టం. అక్కడే పెళ్లి చేసుకుంటాన`ని త్రిష చెప్పింది. కానీ తాను ఎవరితోనైనా ప్రేమలో ఉండ అన్న విషయాన్నీ మాత్రం అమ్మడు బయట పెట్టలేదు. చూస్తుంటే త్వరలో త్రిష పెళ్లిపీటలు ఎక్కేలా కనిపిస్తుంది.