కేసీఆర్‌ కార్లకు ట్రాఫిక్‌ పోలీసుల జరిమానా..కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!

కేసీఆర్‌ కార్లకు ట్రాఫిక్‌ పోలీసుల జరిమానా..కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!

చట్టం ముందు అందరూ సమానమే అని తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసులు మరోసారి నిరూపించారు...చిన్న చిన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సామాన్య ప్రజలకు వేలల్లో జరిమానాలు విధించే ట్రాఫిక్ పోలీసులు...తాజాగా ఏకంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కు పోలీసులు ఫైన్ విధించారు...సీఎం కేసీఆర్‌ వాహన శ్రేణిలో ఉన్న కార్లకు ట్రాఫిక్‌ పోలీసులు ఓవర్‌ స్పీడ్  చాలన్స్‌ విధించారు...కేసీఆర్‌ వాహనాలు గత కొంత కాలంగా  అతి వేగంగా ప్రయాణిస్తున్నాయిని  రాష్ట్రంలో పలు చోట్ల చాలన్స్ విధించారు...అయితే తాజాగా జూన్ 1న పడిన జరిమానాతో మొత్తం దాదాపుగా రూ.4,140  ఫైన్ చేరింది..
మొత్తం ఫైన్‌లలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పోలీసులు మూడు ఫైన్లు విధించారు...మరో ఫైన్‌ను కోదాడ పరిధిలో విధించారు...కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో ఒకటోది.. మాదాపూర్ పరిధిలో ఏప్రిల్ రెండోది, టోలిచౌకి పరిధిలో ఏప్రిల్ 29న మూడోది, ట్యాంక్‌బండ్ పరిధిలో ఈనెలలో నాల్గోది విధించారు. ఈ నాలుగు జరిమానాలు కూడా కూడా అధిక వేగానికి చెందినవే కావడం గమనార్హం...సీఎం కాన్వాయ్‌కు ఫైన్ పడిన విషయం మీడియాలో రావడంతో వెంటనే స్పందించిన సీఎంవో కార్యాలయం ఫైన్లు చెల్లించినట్లు సమాచారం... దాంతో ఈ-చలానాలో కారుకు సంబంధించిన విషయాలు నో పెండింగ్ చలాన్స్‌గా చూపిస్తుంది...