ట్రేడర్స్ దేశవ్యాప్త సమ్మెకు రెడీ

ట్రేడర్స్ దేశవ్యాప్త సమ్మెకు రెడీ

ఫ్లిప్ కార్ట్, వాల్ మార్ట్ ఒప్పందం చిన్న, మధ్య తరహా వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. రెండు రిటైలర్ దిగ్గజాలు భారత్ లో వ్యాపారం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవాటాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ట్రేడర్స్ సమ్మెకు సిద్ధమవుతున్నారు. వచ్చే వారం సమ్మె చేయాలని భావిస్తున్నారు. దేశంలోకి వాల్ మార్ట్ రంగ ప్రవేశంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వ్యాపారాలు లేక చిన్న వ్యాపారులు విలవిల్లాడుతున్నారని ట్రేడర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వ్యాపారం జరిగినా కనీస లాభాలు రావటం లేదంటున్నారు. గత నెలలో,  బెంగళూరుకు చెందిన కంపెనీలో వాల్మార్ట్ 77% వాటాను దక్కించుకుంది. ఇది 16 బిలియన్ డాలర్ల డీల్. ప్రపంచవ్యాప్తంగా ఇ-కామర్స్ పరిశ్రమలో అతిపెద్ద ఒప్పందాల్లో ఈ డీల్ ఒకటిగా నిలిచింది.

ఇండియన్ మార్కెట్ లోకి అమెరికా వాల్ మార్ట్ ప్రవేశంతో భారతీయ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్స్, ఈ కామార్స్ వేదికలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.  గత ఐదు సంవత్సరాలుగా, ఇ-కామర్స్ లోకి సంస్కరణలను తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రయోగాలు చేస్తోంది. వాల్మార్ట్, ఫ్లిప్ కార్ట్  ఒప్పందంతో పరోక్షంగా రిటైల్ వాణిజ్యంలోకి ప్రవేశించేలా ప్రోత్సహించింది. ఇది రిటైల్ రంగంలో దోపిడీకి తెరలేపటమే అవుతుందని ట్రేడర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.