కల్తీ మద్యం తాగి 86 మంది మృతి... ప్రభుత్వం సీరియస్... 

కల్తీ మద్యం తాగి 86 మంది మృతి... ప్రభుత్వం సీరియస్... 

దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే వాటిల్లో మద్యం ఒకటి.  రాష్ట్రాలకు ఆదాయం తెచ్చిపెట్టేవాటిల్లో మద్యం అమ్మకాలు కూడా ఒకటి.  అయితే, కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆదాయం సంపాదించేందుకు మద్యాన్ని కల్తీ చేసి తక్కువ ధరకు అమ్ముతుంటారు.  ఆ మద్యంతాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.  ఇప్పటికే ఇలా ఎందరో మరణించారు.  ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతున్నది. తాజా పంజాబ్ లో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది.  

పంజాబ్ లోని అమృత్ సర్, గురుదాస్ పూర్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 86 మంది మరణించారు.  రెండు రోజుల్లోనే 86 మంది కల్తీ మద్యంకి బలికావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.  కల్తీ మద్యం తయారీ దారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యింది.  ఇక కల్తీ మద్యం తయారీదారులకు సహకరించిన కొందరు అధికారులను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  దీనిపై జ్యూడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది.  కల్తీ మద్యం సేవించి మరణించిన 86 మంది కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది.