భారత్ కు ఇద్దరు కెప్టెన్లు అవసరం... ఎప్పుడంటే..?

భారత్ కు ఇద్దరు కెప్టెన్లు అవసరం... ఎప్పుడంటే..?

విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు మూడు  ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అందువల్ల అతని పై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి టీ 20 ఫార్మాట్ కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ చెయ్యాలి అనే వాదన గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఇక ఈ విషయం పై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ బాట్స్మెన్ టామ్ మూడీ ఇలా మొత్తం 3 ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించడం పూర్తిగా భిన్నమైన ఒత్తిడి అని అన్నారు. భారత క్రికెట్ కు ఇద్దరు కెప్టెన్లు  అవసరం, కానీ ఎప్పుడంటే..  అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఎక్కువ కాలం ఆడాలని అనుకున్నప్పుడు మాత్రమే అని తెలిపాడు. విరాట్ కోహ్లీ 2014 లోనే ఎంఎస్ ధోని నుండి టెస్ట్ కెప్టెన్సీ తీసుకున్నాడు. ఆ తరువాత 2017 లో వన్డే మరియు టీ 20 కెప్టెన్ గా నియమించబడ్డాడు. కోహ్లీ ఎక్కువ రోజులు క్రికెట్ ఆడాలనుకుంటే భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్ లు అవసరం. ఒకవేళ అతను ఇలాగే కొనసాగితే  రెండు-మూడు సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్‌ను కోల్పోతాడు అని మూడీ  తెలిపాడు. అయితే ఇంతక ముందు రాబోయే 2 టీ 20 ప్రపంచ కప్లలో దేనినీ భారత్ గెలవకపోతే కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బీసీసీఐ రోహిత్ కు అప్పగిస్తుంది కావచ్చు అని చోప్రా అభిప్రాయపడ్డారు.