అమితాబ్ మీరు త్వరగా కోలుకోవాలి ....

అమితాబ్ మీరు త్వరగా కోలుకోవాలి ....

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కోవిడ్-19 సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు."నాకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. హాస్పిటల్లో చేరాను హాస్పిటల్ సిబ్బంది, నా కుటుంబ సభ్యులు, నా వద్ద పని చేసే వారికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావలసి ఉంది" అని అమితాబ్ ట్వీట్ చేశారు.దీంతో ఒక్క సారిగా హిందీ చిత్రసీమ ఉలిక్కి పడింది. అమితాబ్ త్వరగా కోలుకోవాలనీ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు . టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, రవితేజ , గుణశేఖర్ అమితాబ్  కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు . మరో వైపు అమితాబ్ తోపాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కుకుడా కరోనా సోకింది . దాంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు .