స్థిరంగా ప్రారంభమైన మార్కెట్‌

స్థిరంగా ప్రారంభమైన మార్కెట్‌

నిన్న ఆరంభ నష్టాలు కోల్పోయిన మార్కెట్‌ ఇవాళ నిలకడగా ప్రారంభమైంది. నిఫ్టి స్వల్ప నష్టంతో 10,622 వద్ద ట్రేడవుతోంది. నిన్న యూరో, అమెరికా మార్కెట్లు ఉత్సాహంగా లాభాలతో క్లోజైనా... ఆసియా మార్కెట్లలో ఆ ఉత్సాహం కన్పించడం లేదు. అంతంత మాత్రం లాభాలతో సూచీలు కదలాడుతున్నాయి. మన మార్కెట్‌లో ఇదే ధోరణి కన్పిస్తోంది.  10,600 స్థాయి మార్కెట్‌కు కీలకంగా మారింది. ఇవాళ ఈ స్థాయిలోనే ఉంటుందా లేదా దిగువకు వస్తుందా అన్నది చూడాలి. నిఫ్టిలోని 50 షేర్లలో 32 షేర్లు నష్టాల్లో ఉన్నాయి.. దీన్నిబట్టి చూస్తే నిఫ్టి 10600 దిగువకు చేరే అవకాశాలే అధికంగా ఉన్నాయి.  లాభాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో  టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఉన్నాయి. నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో పవర్‌ గ్రిడ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, జీ లిమిటెడ్‌ ఉన్నాయి. బీఎస్‌ఇలో బలరాంపూర్‌ చినీ, వక్రంగీ, బజాజ్‌ హిందుస్థాన్‌ షేర్లు అయిదు శాతం వరకు లాభపడ్డాయి. పీసీ జ్యువల్లర్స్‌ మళ్ళీ 8 శాతం క్షీణించింది.