పతనం తప్పించుకున్న నిఫ్టి

పతనం తప్పించుకున్న నిఫ్టి

ఆసియా మార్కెట్ల పతనం నుంచి నిఫ్టి తప్పించుకుంది. ఉదయం అరశాతం వరకు ఉన్న నష్టాలు.. మిడ్‌ సెషన్‌ తరవాత తగ్గాయి. యూరో మార్కెట్లకు ముందు క్లోజైన ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. జపాన్‌ నిక్కీ ఒకటిన్నర శాతం నష్టపోగా... షాంఘై సహా ఇతర దేశాల సూచీలు రెండు శాతం దాకా తగ్గాయి.  భారీ పతనం తరవాత యూరో మార్కెట్లు కోలుకోవడంతో భారత మార్కెట్లు నిలకడగా ముగిశాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 19 పాయింట్లు నష్టంతో 10614 వద్ద ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా రెండున్నర శాతం లాభంతో ముగిశాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో హెచ్‌పీసీఎల్‌ , హిందాల్కో, వేదాంత షేర్లు రెండు శాతం వరకు నష్టపోయాయి. బీఎస్‌ఇలో ఎన్‌బీ వెంచర్స్‌ 17 శాతం లాభపడగా, క్రిసిల్‌ 14 శాతం, ఆర్‌ కామ్‌ పది శాతం లాభంతో ముగిశాయి. డీబీఎల్‌ 13 శాతం నష్టపోగా, అబాన్‌ ఆఫ్‌షోర్ 7 శాతం తగ్గింది.