నిఫ్టికి పెట్రో బూస్ట్‌

నిఫ్టికి పెట్రో బూస్ట్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లు దూసుకెళ్ళాయి. ఐటీ షేర్లు మినహా మిగిలిన రంగాల షేర్లన్నీ గ్రీన్‌లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచాలని ఒపెక్‌, రష్యా నిర్ణయించినట్లు వార్తలు రావడంతో ధరలు తగ్గుముఖం పట్టారు. ఇవాళే 2 శాతం దాకా తగ్గాయి. ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి సెషన్‌ కొనసాగేకొద్దీ బలం పుంజుకుంది.

క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 83 పాయింట్లు పెరిగి 10,688 పాయింట్ల వద్ద ముగిసింది.  నిఫ్టిలో 34 షేర్లు లాభాలలో ముగిశాయి. వీటిలో సన్‌ ఫార్మా 6.55 శాతం లాభంతో టాప్‌లో ఉంది. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ షేర్లు 5 నుంచి 6 శాతం వరకు లాభపడ్డాయి. గెయిల్‌, లుపిన్‌లు కూడా 5శాతం వరకు  పెరిగాయి. ఐటీ షేర్లలో  అమ్మకాల ఒత్తిడి వచ్చింది. టెక్‌ మహీంద్రా 4 శాతం దాకా క్షీణించగా, టీసీఎస్‌ 2.5శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2 శాతం తగ్గింది. బీఎస్‌ఇలోనూ ట్రెండ్‌ కన్పించింది. జస్ట్‌ డయల్‌ ఏకంగా 20 శాతం అప్పర్‌ సీలింగ్‌తో ముగిసింది. కెన్‌ ఫిన్‌ హోమ్ 10.75 శాతం చొప్పున లాభపడ్డాయి.