చిన్నారి నాగ వైష్ణవి కేసులో నేడు తుదితీర్పు...

చిన్నారి నాగ వైష్ణవి కేసులో నేడు తుదితీర్పు...

విజయవాడలో సంచలనం రేపిన చిన్నారి నాగ వైష్ణవి కేసులో నేడు తుది తీర్పు వెలువరించనుంది కోర్టు... 2010 జనవరి 30న కారులో స్కూల్ కి వెళ్తున్న చిన్నారి నాగ వైష్ణవిని కిడ్నాప్ చేసి... గొంతు నులిమి హత్య చేసిన అనంతరం బాయిలర్‌లో వేసి దహనం చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. నాగవైష్ణవి హత్యతో పాటు అడ్డువచ్చిన డ్రైవర్ లక్ష్మణ రావును హత్య చేయడం... తన ముద్దుల తల్లి హత్య వార్త విని గుండెపోటుతో తండ్రి పలగాని ప్రభాకర్ మృతిచెందారు. ఆ ఇద్దరి అంత్యక్రియలు అప్పట్లో అందరూ కన్నీరుకార్చేలా చేశాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన ఏ1 మొర్ల శ్రీనివాసరావు, ఏ2 వెంపరాల జగదీష్, ఏ3 పంది వెంకట్రావ్ గత ఏడేళ్లుగా జైలులో ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు కాకుండానే కేసు విచారణ పూర్తి కాగా... నేడు తుది తీర్పు వెలువడనుంది.