సీఎం నిర్ణయం కోసం ఎదురు చూపు.. 

సీఎం నిర్ణయం కోసం ఎదురు చూపు.. 

తాము సీఎంతో చర్చలు జరపలేదని.. మంత్రులతో మాత్రమే చర్చించి సంస్థ బాగుకోసం కొన్ని సూచనలు చేశామని వెల్లడించారు  టిఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రులతో తాము చర్చించిన విషయాలను వారు సీఎంకు నివేదిస్తారని.. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఈరోజు మంత్రులతో టీఎంయూ నేతలు చర్చలు జరిపారు. తామంతా ముఖ్యమంత్రి నిర్ణయం కోసం వేచి చేస్తున్నామని.. అయన నిర్ణయం తర్వాత సమ్మెపై మాట్లాడతామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.