ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ఆసీస్‌ కెప్టెన్‌గా...

ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ఆసీస్‌ కెప్టెన్‌గా...

ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ఆసీస్‌ కెప్టెన్ గా యువ ఆటగాడు టిమ్‌ పైన్‌ను ఎంపికచేసినట్లు ఆస్ట్రేలియా కొత్త కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ ఏడాది పాటు నిషేదానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆసీస్ జట్టుకి కొత్త కెప్టెన్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. అయితే జూన్‌లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది ఆసీస్‌. ఈ క్రమంలో వన్డే సిరీస్‌కు ఆసీస్‌ కెప్టెన్‌గా యువ ఆటగాడు టిమ్‌ పైన్‌ను, వైస్‌ కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా సెలక్టర్స్‌ ఛైర్మన్‌ తెలిపారు. ఇక ఏకైక టీ-20 మ్యాచ్‌కు కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ నాయకత్వం వహిస్తారని తెలిపారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఆసీస్ ఐదు వన్డేలు‌, ఒక టీ-20 మ్యాచ్‌ ఆడుతుంది. బాల్‌ టాంపరింగ్ వివాదం తర్వాత దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు‌కు తాత్కాలిక కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ వ్యవహరించిన విషయం తెలిసిందే.

Photo: youtube screen shot